ఆమధ్య మంచు విష్ణుతో ఒక సినిమాను తీయడానికి చేసిన ప్రయత్నాలు ముందుకు సాగక పోవడంతో ఇక ఈ దర్శకుడు కెరియర్ ముగిసి పోయినట్లే అని అంతా భావించారు. అలాంటి పరిస్థితుల మధ్య హీరో గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ సెట్ అవ్వడంతో మళ్ళీ ఈ దర్శకుడి హవా మొదలవుతుంది అని అంతా భావిస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ ను ఏకంగా యూరప్ లోని మిలాన్ దేశంలో ఒక భారీ సెట్ వేసి అక్కడ ఈసినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తి చేయడంతో ఈ మూవీ నిర్మాత ఏధైర్యంతో గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ పై ఇంత భారీగా ఖర్చు పెడుతున్నాడు అంటూ కొందరు షాక్ అవుతున్నారు. ఈ షూటింగ్ కు సంబంధించిన ఒక వీడియోను శ్రీను వైట్ల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దర్శకుడు భారీ తనం పై కాకుండా సినిమా కథ విషయంలో అదేవిధంగా కంటెంట్ విషయంలో శ్రద్ధ పెడితే బాగుంటుంది కదా అంటూ కొందరు శ్రీను వైట్లకు ఉచిత సలహాలు ఇస్తున్నారు.
ఈ సినిమా విజయం ఒక ఫెయిల్యూర్ హీరోకు అదేవిధంగా మరో ఫెయిల్యూర్ దర్శకుడుకి కీలకంగా మారిన పరిస్థితులలో ఇప్పటికీ శ్రీను వైట్ల మారకపోతే ఇక అతడి కెరియర్ నిలదొక్కుకోవడం కష్టం అవుతుంది అంటూ అతడి అభిమానులు అభిప్రాయపడుతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి