ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో సినిమా నిర్మాణం ఒక పజిల్ గా మారిపోయింది. ఏసీనిమా హిట్ అవుతుందో ఏసీనిమా ఫ్లాప్ అవుతుందో తలలు పండిన ఇండస్ట్రీ ప్రముఖులు కూడ చెప్పలేకపోతున్నారు. దీనికితోడు ఊహించని ఘనవిజయాలు సాధిస్తున్న కొన్ని చిన్న సినిమాలు ఇండస్ట్రీలో పట్టున్న వారిని కూడ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా విడుదల అయిన ‘మ్యాడ్’ సినిమా సగటు ప్రేక్షకులకు ఎందుకు అంతగా నచ్చిందో చేయి తిరిగిన దర్శక నిర్మాతలకు కూడ అర్థం కావడంలేదు అని అంటున్నారు.



ప్రస్తుతం టాప్ హీరోలతో సినిమాలు తీయడం మరింత జూదంగా మారిపోయింది అన్న విశ్లేషణలు వస్తున్నాయి. సినిమాను చాల పక్కా ప్లాన్ తో నిర్మాణాం చేస్తారు అని పేరున్న ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడ టాప్ హీరోల సినిమాలు వచ్చేసరికి తాము అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయలేక సతమతమై తున్నారు. దీనితో టాప్ హీరోలతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు గట్టేక్కాలి అంటే సినిమాకు సీక్వెల్ తీయడం తప్ప మరొక మార్గం లేకుండా పోయింది.



‘బాహుబలి’ మొదలుపెడుతున్నప్పుడు రాజమౌళి ఆసినిమాను సీక్వెల్ తీయాలని అనుకోలేదు అని అంటారు. అయితే బడ్జెట్ పెరిగి పోవడంతో ఈమూవీ సీక్వెల్ గా వచ్చింది. ‘పుష్ప’ ‘కేజీ ఎఫ్’ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాల పరిస్థితి కూడ ఇదే అని వార్తలు ఉన్నాయి. వాస్తవానికి ఒక్క ‘దృశ్యం’ సినిమా తప్ప కథ రీత్యా ఏసీనిమాకు సీక్వెల్ తీయవలసిన అవసరం లేదు.



అయితే బడ్జెట్ విపరీతంగా పెరిగి పోతోంది అన్న ఆలోచనలు రాగానే మరో ఆలోచన చేయకుండా సీక్వెల్స్ ప్రకటన చేసి గట్టేకకాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. లేటెస్ట్ గా సీక్వెల్ ప్రకటన వచ్చిన ‘దేవర’ విషయాయంలో కూడ ఇదే పరిస్థితి అన్న ప్రచారం ఉంది. లేటెస్ట్ గా విడులైన ‘చంద్రముఖి 2’ సీక్వెల్ ఫలితం గమనిస్తే కథ లేకుండా ప్రతి సినిమాకు సీక్వెల్స్ ఆలోచన చేస్తే అది టాప్ హీరోలకు దర్శకులకు మంచిది కాదు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: