ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ కు వచ్చిన ‘వీరసింహా రెడ్డి’ బాలకృష్ణ కెరియర్ లో అంత్యంత గ్రాస్ కలక్షన్స్ వసూలు చేయడంతో అలాంటి రికార్డును మరొకసారి రిపీట్ చేస్తుందని ‘భగవంత్ కేసరి’ పై అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ఈసినిమాకు అనీల్ రావిపూడి ట్రాక్ రికార్డు కూడ కొంతవరకు ప్రతిభందకం గా మారుతుందా అన్న సందేహలు కొందరికి ఉన్నాయి.
అనీల్ రావిపూడి ని ఈప్పటివరకు పరాజయం అన్న పదం పలకరించలేదు. అతడు ఇప్పటివరకు తీసిన ‘పఠాసు’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ సినిమాలు అన్నీ వినోదాత్మకంగా నడిచే సినిమాలు మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తీసినప్పటికీ ఆ సినిమాలో అనవసరపు కామెడీ పెట్టి ప్రేక్షకులను విసికించాడు అన్న విమర్శలు వచ్చాయి. అయితే అతడు ఇంత వరకు పూర్తి మాస్ కమర్షియల్ సినిమాను తీయలేదు.
బాలయ్య సినిమా అంటే మాస్ మసాల అంశాలు విపరీతంగా ఉండాలి. అలాంటి పవర్ ఫుల్ కథను పవర్ ఫుల్ సీన్స్ ను బాలయ్య అనీల్ రావిపూడి తీయగలడా అన్న సందేహాలు కొందరికి ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కు ట్రైలర్ కు మంచి స్పందన వచ్చినప్పటికీ ఎంతవరకు అనీల్ రావిపూడి బాలయ్య ను మాస్ హీరోగా ఈ సినిమాలో ఎంతవరకు నిలబడతాడు అన్న విషయం పై ఈ మూవీ ఘనవిజయం ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి