గ తంలో హీరోయిన్స్ కు పెళ్ళి అయింది అని తెలిస్తే చాలు వారి డిమాండ్ పూర్తిగా తగ్గిపోయేది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయి హీరోయిన్స్ కు పెళ్లి అయినప్పటికీ వారి డిమాండ్ మరింత పెరగడమే కాకుండా వారికి ఇచ్చే పారితోషికం కూడ రెట్టింపు అవ్వడం ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ గా మారింది.



ఈలిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్నది దీపికా పదుకొనె బాలీవుడ్ హీరో రణవేర్ సింగ్ ని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె డిమాండ్ తగ్గలేదు సరికదా మరింత పెరిగిపోయింది. ‘పఠాన్’ మూవీలో ఆమె చేసిన బికినీ షోకు యూత్ విపరీతంగా ఆకర్షితులు అవ్వడంతో ఆమూవీ 1000 కోట్ల సినిమాగా మారిన విషయం తెలిసిందే. ప్రభాస్ తో ‘కల్కి’ మూవీలో ఈమె హీరోయిన్ గా చేసే విషయంలో ఒప్పించచడానికి ఈమెకు 15 కోట్ల పారితోషికం ఇచ్చారు అన్న వార్తలు కూడ ఉన్నాయి.




ఇక కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న తరువాత ఆమె డిమాండ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘టైగర్ 3’ ‘మేరీ క్రిస్మస్ సినిమాలకు 10 కోట్లకు పైగా డిమాండ్ చేసింది అని అంటారు. బాలీవుడ్ బ్యూటీగా పేరుగాంచిన కీయారా అద్వానీ సిద్దార్ధ్ మ‌ల్హోత్రాని పెళ్ళి చేసుకున్న తరువాత ఆమె స్పీడ్ మరింత పెరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో  

'గేమ్ ఛేంజ‌ర్' లో నటిస్తున్నందుకు ఆమెకు కూడ భారీ పారితోషికం ముట్టింది అని అంటారు. ఇక 'గంగూబాయి క‌తియావాడి' మూవీతో జాతీయ అవార్డు అందుకున్న అలియా భట్ రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని తల్లి అయిన తల్లి అయిన తరువాత కూడ ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.దక్షిణాదికి సంబంధించి లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయన తార పెళ్లి చేసుకున్న తరువాత షారూఖ్ ఖాన్ ఆమెను బలవంత పెట్టి భారీ పారితోషికం ఇవ్వడమే కాకుండా ఆమె కండిషన్స్ కు ఒప్పుకుని ‘జవాన్’ సినిమాలో నయన్ తో నటింప చేసిన విషయం తెలిసిందే. ఈమూవీ బ్లాక్ బష్టర్ అయిన తరువాత ఆమెకు బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వస్తున్నా వాటిని నయనతార తిరస్కరిస్తోంది అంటే నయనతార మ్యానియా పెళ్లి అయిన తరువాత ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతోంది..  






 



మరింత సమాచారం తెలుసుకోండి: