ఈ వార్తలే నిజం అయితే ఈమూవీ టోటల్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఈ మూవీకి టోటల్ గ్రాస్ కలక్షన్స్ 300 కోట్లు వచ్చి తీరాలి అని అంటున్నారు. ఇలాంటి ఫిగర్స్ అందుకోవాలి అంటే ‘బాహుబలి 2’ ‘ఆర్ ఆర్ ఆర్’ రేంజ్ లో ‘సలార్’ బ్లాక్ బష్టర్ అయి తీరాలి. దీనితో అలాంటి రేంజ్ ‘సలార్’ కు ఎంతవరకు ఉంది అన్న ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి.
క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘సలార్’ మూవీకిగట్టిపోటీ ఉంది. షారూఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ పోటీ ‘సలార్’ చాల ఎక్కువగా ఉండబోతోంది. దీనికితోడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలలో ఉండే విధంగా ‘సలార్’ లో హీరో హీరోయిన్స్ పై పాటలు రొమాంటిక్ సీన్స్ ఉండవు. సినిమా అంతా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ట్రెండ్ లో కాకుండా ‘కేజీ ఎఫ్’ తరహాలో ఉంటుందని లీకులు వస్తున్నాయి.
ఇప్పటికే ‘కేజీ ఎఫ్’ మూవీని ధియేటర్లలో ఓటీటీ లలో ప్రేక్షకులు ఒకటికి రెండు సార్లు చూసిన పరిస్థితులలో మళ్ళీ అదే తరహా సీన్స్ ‘సలార్’ లో కనిపిస్తే ఎంతవరకు సగటు ప్రేక్షకుడుకి నచ్చుతుంది అన్న సందేహాలు కూడ ఉన్నాయి. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీ పై విపరీతంగా పెంచుకున్న నమ్మకంతో తన సినిమాను ఏకంగా షారూఖ్ సినిమాతో పోటీగా విడుదల చేస్తున్నాడు. ఈపోటీలో ‘సలార్’ విజయం సాధిస్తే ఇక ప్రభాస్ కు తిరుగుండదు అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి