యంగ్ హీరో విశ్వక్ సేన్ తరుచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం  పరిపాటిగా మారింది. అతడు నటించిన సినిమాల కంటే అతడు  తరుచూ చేసే వివాదాస్పద కామెంట్స్ తో ఎప్పుడు మీడియాకు  హాట్ టాపిక్ గా కొనసాగుతూ ఉంటాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న కొత్త సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల తేదీ విషయంలో జరుగుతున్న పరిణామాల పట్ల సోషల్ మీడియాలో ఇతడు చేసిన  కామెంట్స్ ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా మారింది.  



తన సినిమా ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ నెలలోనే విడుదలవుతుందని అలా జరగని పక్షంలో ఇకపై తనను తన సినిమా ప్రమోషన్లలో చూడరని  అల్టిమేటం ఇవ్వడం వెనుక కారణం ఏమిటి  అంటూ ఇండస్ట్రి  వర్గాలలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు బ్యాక్ గ్రౌండ్ లేని తనలాంటి వాళ్ళను అణచడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని ఇక సహించే ప్రసక్తే లేదని ఏకంగా దేవుడు మీద ఒట్టు వేసి సవాల్ విసరడం ఇండస్ట్రిలోని చాలమందికి హాట్ టాపిక్ గా మారింది.  



వాస్తవానికి ఈమూవీ నిర్మిస్తున్నది చిన్న నిర్మాణ సంస్థ కాదు. సితార నాగ వంశీ ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్నాడు. అయితే డిసెంబర్ లో ‘హాయ్ నాన్న’  ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలు ఆ నెల మొదటి వారంలో విడుదల అవుతున్న పరిస్థితులలో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ విడుదల వాయిదా పడుతుంది అంటూ లీకులు వస్తున్నాయి. ఈలీకులు ఈ యంగ్ హీరో దృష్టి వరకు రావడంతో ఈవిధంగా ఆవేశంగా స్పందించాడు అనుకోవాలి.



తన కొత్త చిత్రం విడుదల అయినప్పుడల్లా విశ్వక్ సేన్ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నాడు. అతడి తోటి టాప్ యంగ్ హీరోలు చాల తెలివిగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలోని అందరితోను సన్నిహితంగా ఉంటూ ఉంటే విశ్వక్ సేన్ ఉండటం కాకతాళీయం అనుకోవాలి. అప్ కమింగ్ హీరో లు   ఇండస్ట్రీలోని అందరి దర్శకులతోను  నిర్మాతల తోను సాన్నిహిత్యం కొనసాగిస్తూ ఉంటే విశ్వక్ సేన్ మాత్రం తన రూట్ పూర్తిగా డిఫరెంట్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: