అయితే అలాంటి ఫోటో అనుకోకుండా సోషల్ మీడియాకు లీక్ అవ్వడంతో రమ్మీ ఆడుతున్న మహేష్ వెంకటేష్ ల ఫోటోను చాలామంది ఆశక్తిగా చూడటమే కాకుండా చిన్నోడు పెద్దోడు పేకాట ఆడటం ఏమిటి అంటూ సరదాగా కామెంట్స్ కూడ పెడుతున్నారు. ఈమధ్య హైదరాబాద్ లో ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కొత్తగా నిర్మించిన క్లబ్ హౌస్ ఓపెనింగ్ కు మహేష్ వెంకటేష్ లు అతిధులుగా హాజరు అయినట్లు తెలుస్తోంది.
కేవలం అతిధులగా వెళ్లాడమే కాకుండా అక్కడ టేబుల్ పై కూర్చుని కొంతమంది ప్రముఖులతో సరదాగా పేకాట ఆడినట్లు తెలుస్తోంది. ఆ ఫంక్షన్ కు వచ్చిన కొందరు చేతిలో పేక ముక్కలు పెట్టుకున్న మహేష్ వెంకటేష్ ల సరదాలను హైలెట్ చేస్తూ రకరకాల సెటైర్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ‘చిన్నోడు పెద్దోడు’ కలిసి మళ్ళీ ఒక మల్టీ స్టారర్ లో నటించవచ్చు కదా అంటూ సలహాలు కూడ ఇస్తున్నారు.
బయట ఇంత సరదాగా అన్నదములులా కనిపిస్తున్న వీరిద్దరూ సంక్రాంతి సినిమాల విషయంలో ఒకరి పై ఒకరు పోటీ పడుతూ రాబోతున్న సంక్రాంతి వార్ లో తమ ‘గుంటూరు కారం’ ‘సైంధవ్ సినిమాలతో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. దీనితో ఈ సంక్రాంతి రేస్ లో చిన్నోడు నెగ్గుతాడా లేక పెద్దోడు నెగ్గుతాడా అన్న విషయం అత్యంత ఆశక్తి దాయకంగా మారింది. అయితే మాస్ ప్రేక్షకులను మెప్పించే విషయంలో చిన్నోడు ముందు వరసలో ఉంటే పెద్దోడు మాత్రం ఇంకా తన మాస్ ఇమేజ్ ని పెంచుకోలేక పోతున్నాడు అనుకోవాలి.. .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి