ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ ఎడిట్ చేస్తున్న పరిస్థితులలో ఈమూవీ సెకండ్ ఆఫ్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఏమాత్రం నచ్చకపోవడంతో ఆ సీన్స్ ను మళ్ళీ ఘాట్ చేయాలి అన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈసినిమాకు సంబంధించి మహేష్ ఇచ్చిన టైమ్ టార్గెట్ నవంబర్ నెలాఖరు కావడంతో ఆ టార్గెట్ సమయంలో ఈ రీ ఘాట్ పూర్తి అవుతుందా అన్న సందేహాలు త్రివిక్రమ్ కు ఏర్పడినట్లు టాక్.
దీనికితోడు ఈమూవీ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి డిసెంబర్ లో హాలిడే ట్రిప్ కు వెళ్ళాలి అన్న ఉద్దేశ్యంలో ఉన్న మహేష్ ఎంతవరకు త్రివిక్రమ్ రీ ఘాట్ ఆలోచనలకు సహకరిస్తాడు అన్న సందేహాలు కొందరికి ఉన్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలను వినోదాత్మకంగా తీయడంలో సిద్దహస్తుడైన త్రివిక్రమ్ మాస్ సినిమాలను తీసే విషయంలో అంతగా రాణించలేడు అన్న ముద్ర ఉంది.
దీనితో పూర్తి అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీగా మహేష్ తో తీస్తున్న ‘గుంటూరు కారం’ మూవీ ఎంతవరకు మాస్ ప్రేక్షకులకు నచ్చేలా త్రివిక్రమ్ తీయగలడు అన్న సందేహాలు చాలమందికి ఉన్నాయి. దీనితో ఈమూవీ మేకింగ్ విషయంలో త్రివిక్రమ్ కన్ఫ్యూజ్ అవుతున్నాడా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోలో నిర్మించిన ఒక భారీ సెట్ లో త్రివిక్రమ్ మహేష్ శ్రీలీల పై ఒక రొమాంటిక్ సాంగ్ తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి