దసరా రేస్ చెప్పుకోతగ్గ స్థాయిలో ఆశాజనకంగా జరగలేదు. దీనితో ఇండస్ట్రీ దృష్టి అంతా ఈవారం చివరిలో విడుదల కాబోతున్న సినిమాల పై ఉంది. సాధారణంగా అమావస్య సెంటిమెంట్ తో తెలుగు నిర్మాతలు తమ సినిమాలను దీపావళి పండుగనాడు విడుదల చేయడానికి సాహసించరు. అయితే తమిళనాడు ఉత్తరాది రాష్ట్రాల వారికి దీపావళి చాల పెద్ద పండుగ కావడంతో ఆ పండుగను క్యాష్ చేసుకోవడానికి భారీ సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు.



ఈ సంవత్సరం దీపాళికి కూడ డబ్బింగ్ సినిమాల మ్యానియా కొనసాగుతోంది. ‘జ‌పాన్’ ‘జిగ‌ర్‌తండా డ‌బులెక్స్’ ‘టైగ‌ర్-3’ ఈ దీపావ‌ళికి రిలీజ్ కాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల థియేట‌ర్ల‌ను ఈ మూడు చిత్రాల‌కూ భారీగానే థియేట‌ర్లు ఇస్తున్నారు. ఈమూడు సినిమాల పై కూడ మంచి అంచనాలు ఉండటంతో కలక్షన్స్ బాగా వస్తాయి అన్న ఆశతో ఈమూడు సినిమాల రిలీజ్ వెనుక ఇండస్ట్రీ పెద్దల హస్తం పరోక్షంగా ఉంది అన్న ప్రచారం జరుగుతోంది.



తమిళ హీరో కార్తీ కి నాగార్జునకు ఉన్న సాన్నిహిత్యం  తో  ‘జపాన్’ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు. గతంలో కార్తీ నటించిన ‘సర్తార్’ మూవీని కూడ అన్నపూర్ణ స్టూడియోస్  విడుదల చేసింది. అదేవిధంగా కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో లారెన్స్, ఎస్.జె.సూర్య న‌టించిన ‘జిగ‌ర్ తండా డ‌బులెక్స్‌’ కు కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉండటంతో ఈమూవీని సురేష్ బాబు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.



ఇక సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ మూవీకి భారీ స్థాయిలో క్రేజ్ ఉండటంతో ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాడానికి దిల్ రాజ్ రంగంలోకి దిగి ఈమూవీని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్న నేపధ్యంలో ఈమూవీని కూడ భారీ స్థాయిలో ధియేటర్లు దక్కి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఈమూడు డబ్బింగ్ సినిమాల వార్ లో ప్రేక్షకులు ఏసినిమాకు ఓటు వేస్తారో తెలియకపోయినా ముగ్గురు ప్రముఖులు మూడు సినిమాల వెనుక ఉండటంతో ఈసారి దీపావళి సినిమాల డబ్బింగ్ రేస్ ఆశక్తిదాయకంగా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: