దీనికికారణాలు అనేకం ఉన్నాయి అని అంటారు. ఇప్పటికీ మన టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలకు తమిళ ప్రేక్షకులలో చెప్పుకోతగ్గ స్థాయిలో క్రేజ్ లేదు. అయితే కాలీవుడ్ హీరోలకుమాత్రం తెలుగు ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంది. రజనీకాంత్ కమలహాసన్ విజయ్ సూర్య విక్రమ్ లకు మన తెలుగు ప్రేక్షకులలో కూడ లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ అభిమానాన్ని ఆధారంగా తీసుకుని ప్రతి సంవత్సరం సంక్రాంతికి మన టాప్ హీరోల సినిమాలతో పోటీ పడుతూ తమిళ డబ్బింగ్ సినిమాలు విడుదల అవ్వడం ఒక ట్రెండ్ గా మారింది.
దీనివల్ల సంక్రాంతికి విడుదలయ్యే టాప్ హీరోల సినిమాలకు కలక్షన్స్ విషయంలో గండి పడుతోంది అంటూ ఇండస్ట్రీలోని ఒక వర్గం వాదిస్తోంది. ఈవిషయాన్ని ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రి ప్రముఖులు చాలా సిరీయస్ గా తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా రాబోతున్న 2024 సంక్రాంతికి విడుదలకాబోతున్న టాప్ హీరోలు మహేష్ వెంకటేష్ విజయ్ దేవరకొండ రవితేజా సినిమాలతో పోటీగా కొన్ని భారీ డబ్బింగ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి.
ఈసినిమాలను మన టాలీవుడ్ ఇండస్ట్రికి సంబంధించిన ప్రముఖులు విడుదచేయడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ తె టాలీవుడ్ గా మారింది. ఈవిషయం పై కొందరు ఇండస్ట్రి ప్రముఖులు వేరే విధంగా కామెంట్ చేస్తున్నారు. కోలీవుడ్ లో మన సినిమాలకు ఆదరణ తక్కువైనప్పుడు వాళ్ల చిత్రాల్ని మనమెందుకు ప్రోత్సహించాలి అంటూ ఒక వివాదాన్ని కొందరు నిర్మాతలు తెర పైకి తీసుకువస్తున్నారు. దీనితో రానున్న సంక్రాంతికి విడుదలకాబోతున్న టాప్ హీరోల సినిమాలకు భారీ డబ్బింగ్ సినిమాలతో కలవర పాటు మొదలైంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి