ఒక వెబ్ సిరీస్ ను విడిచిపెట్టకుండా సగటు ప్రేక్షకుడు చూడాలంటే ఆవెబ్ సిరీస్ లోని కధ కధనం ప్రేక్షకులకు బాగా నచ్చితీరాలి. కరోనా  పరిస్థితులలో  ఓటీటీలు ప్రసారం చేసే ప్రతి వెబ్ సిరీస్ ను విడిచి  పెట్టకుండా చూసినట్లుగా ఇప్పుడు సగటు ప్రేక్షకుడు ప్రతి వెబ్ సిరీస్ ను  చూడటంలేదు.  


ఫ్యామిలీ మ్యాన్ మీర్జాపూర్ స్కామ్ 1992 స్థాయిలో ఉన్న వెబ్ సిరీస్ ల ను మాత్రమే ఆదరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్  గా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్నది ‘రైల్వేమెన్’ పై బుల్లితెర ప్రేక్షకులు బాగా ఆశక్తి  కనపరుస్తున్నారు. సుప్రసిద్ధ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్  నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ను శివ్ రవైల్ దర్శకత్వం వహించాడు.    


నాలుగు ఎపిసోడ్లు గా గంటకు ఒకటి చొప్పున మొత్తం 240 నిమిషాల నిడివితో ‘ది రైల్వే మెన్’ ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కథ 40 సంవత్సరాల క్రితం నాటిది. 1985లో భోపాల్ లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి లీకైన విషవాయువుల వల్ల 15ను వందల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో ఆసమయంలో రైల్వే స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ సిద్ధి సెంట్రల్ రైల్వె జనరల్ మేనేజర్ రతిపాండే లు కలిసి భోపాల్ మీదుగా వెళ్లాల్సిన గోరఖ్ పూర్  ముంబై రైలుని ఆపే ప్రయత్నం చేస్తారు.


ఈక్రమంలో జరిగే సంఘటనలు కళ్ళముందే అయినవాళ్లు చనిపోతుంటే బాధితులు పడ్డ నరకయాతన నగరంతో పాటు ట్రైన్ లో ఏర్పడ్డ విషమపరిస్థితుల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ను చాల సహజంగా    ఉత్కంఠ  భరితంగా తీశారు. ఓటీటీ  వెబ్ సిరీస్ లో కనిపించే  క్రైమ్ సైకో కిల్లింగ్  కధలకు భిన్నంగా ఈనాటి తరానికి  ఏమాత్రం అవగాహన లేని ఒక రియల్ డిజాస్టర్ సంఘటన కావడంతో ఈవెబ్ సిరీస్ కు చాలా మంది  కనెక్ట్ అవుతున్నారు..      


మరింత సమాచారం తెలుసుకోండి: