తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా ... నటుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు పోయిన సంవత్సరం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసారా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

మూవీ అద్భుతమైన కలెక్షన్ లాంజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ క్రేజ్ కూడా తెలుగు లో బాగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత ఈయన మైత్రి సంస్థ వారు నిర్మించిన అమిగిస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులకు అందించడంలో ఘోరంగా విఫలం అయింది. ఇకపోతే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ "డేవిల్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసారా మూవీ లో కూడా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇక వీరి కాంబో లో ఇది రెండవ సినిమా.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని డిసెంబర్ 29 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: