తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచు గుర్తింపును సంపాదించుకున్న వారిలో వేణు ఒకరు. చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఏ తర్వాత ఈటీవీలో ప్రసారం అయినటువంటి జబర్దస్త్ కామెడీ షో లో పాటిస్పేట్ చేశాడు. ఈ షో ద్వారా ఈయన తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్నాడు. ఇలా కమెడియన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పాటు చేసుకున్న వేణు కొంత కాలం క్రితం ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా రూపొందిన బలగం అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే.

పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక ఈ మూవీ భారీ కలెక్షన్ లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ ద్వారా వేణు కి దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే బలగం మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వేణు తన తదుపరి మూవీ కి ఇప్పటికే హీరోను లాక్ చేసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... వేణు తాజాగా నాచురల్ స్టార్ నాని కి ఓ కథను వినిపించినట్లు ... ఆ కథ నాని కి కూడా బాగా నచ్చినప్పటికీ కథలో కొన్ని మార్పులు ... చేర్పులను సూచించినట్లు నాని చెప్పినట్లుగానే ప్రస్తుతం కథలో కొన్ని మార్పులు ... చేర్పులను వేణు చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి యల్లమ్మ అనే టైటిల్ ని కూడా ఈ మూవీ బృందం అనుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా డిసెంబర్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: