తమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు కొన్ని సంవత్సరాల క్రితం బిచ్చగాడు అనే సినిమాలో హీరో గా నటించి విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగు లో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన తర్వాత తెలుగు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభించాయి.

మూవీ అద్భుతమైన విజయం సాధించడం ఇందులో విజయ్ ఆంటోనీ తన నటనతో ప్రేక్షకులను బాగా అలరించడంతో ఈ సినిమాతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు బిచ్చగాడు 2 అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో ఈయన నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. బిచ్చగాడు మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు.

దానితో ఈ మూవీ కూడా మంచి అంచనాల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యి ప్రేక్షకులను పర్వాలేదు అని స్థాయిలో ఆకట్టుకుని మంచి విజయాన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా చానల్లో ప్రసారం అయింది. మొదటి సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 7.12 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది. ఒక డబ్బింగ్ సినిమాకు ... అందులోనూ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం సాధించిన ఈ సినిమాకు బుల్లి తెరపై ఈ రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ దక్కడం అనేది గొప్ప విషయం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: