తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరుపొందిన చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర సినిమా 50 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది. హీరో అఖిల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ఏజెంట్.. ఈ సినిమా 30 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది. హీరో నితిన్ , శ్రీ లీల కాంబినేషన్లో వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా 19 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చిందట.
నాగచైతన్య కృతి శెట్టి కాంబినేషన్లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రం కస్టడీ 17 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గాండీవ దారి అర్జున సినిమా 16 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.. సమంత డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ డ్రామా చిత్రం శాకుంతలం ఈ సినిమా 14 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.. గత ఏడాది ఎక్కువగా నష్టాలను మిగిల్చిన చిత్రాలు ఇవి మరి ఏడాదైన అభిమానులను మెప్పించే విధంగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తారేమో చూడాలి మరి.. ఈ ఏడాది కూడా భారీ బడ్జెట్ సినిమాలు స్టార్ హీరోల చిత్రాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగానే ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి