సినీ సెలబ్రిటీల జీవితాలు తెరమీద ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటిది చూసినప్పుడు జీవితం అంటే వీళ్లది. నచ్చినట్టుగా బ్రతికేస్తూ ఉంటారు. ఇక సినిమాల్లో ఎంతో ఈజీగా నటించడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ తెరమీద అందంగా కనిపించే సినీ సెలబ్రిటీల జీవితాలలో కూడా ఎన్నో కనిపించని కష్టాలు ఉంటాయి అని అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు అందరికీ అర్థమవుతూ ఉంటుంది. ఇలా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏదైనా విషయం వెలుగులోకి వచ్చిందంటే చాలు అది ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఒక బుల్లితెర నటుడుకి సంబంధించిన వార్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒక యువతి బుల్లితెర నటుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అయితే కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా తండ్రిని ఎదిరించి మరి అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ చివరికి ఇప్పుడు అతనికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. కోలీవుడ్ బుల్లితెర నటుడు మునిష్ రాజాను ప్రేమ పెళ్లి చేసుకుని విడిపోయినట్లు జీనత్ ప్రియ అనే యువతి ఇటీవల వెల్లడించింది. ఇకపోతే తన విడాకుల ప్రకటనకు సంబంధించిన వీడియో ని ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జీనత్ ప్రియ. నా పేరు జీనత్ ప్రియ. నేను రాజ్ కిరణ్ సార్ దత్తపుత్రికను. 2022లో నటుడు మనిషి రాజాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రస్తుతం మేమిద్దరం విడిపోయాము. మేం విడిపోయి కూడా కొన్ని నెలలు అయింది. మా పెళ్లికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. నా పెళ్లి కారణంగా నాన్న చాలా బాధపడ్డారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచారు. నాకు సహాయం చేశారు. ఈ విషయంలో నన్ను క్షమించు నాన్న అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది జీనత్ ప్రియ. అయితే సోషల్ మీడియా వేదికగా జీనత్ ప్రియ, మునిష్ రాజాలకు పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి వరకు వెళ్ళింది. కానీ కొన్ని రోజులకే పెళ్లి పెటాకులుగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: