ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన "కే జి ఎఫ్ చాప్టర్ 1" ... "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ లతో ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈయన ప్రభాస్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా సలార్ అనే సినిమాను రూపొందించాడు.

పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా  వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా ఈ మూవీ రెండవ భాగం షూటింగ్ కూడా మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ దర్శకుడు మరి కొంత కాలంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఉపేంద్ర దర్శకత్వం గురించి ఆయన ప్రశంశల వర్షం కురిపించాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ... నాకు ఉపేంద్ర గారి దర్శకత్వం అంటే చాలా ఇష్టం. ఉపేంద్ర గారిలా ఎవరు సినిమాలను తెరకెక్కించలేరని ... విభిన్నమైన కథలను అంతే డిఫరెంట్ గా వెండి తెరపై ఆవిష్కరించడంలో ఆయన సూపర్ టాలెంటెడ్ అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. ఉపేంద్ర తీసిన సినిమాలను చూస్తూ ఉంటే ఇలాంటి కథలతో కూడా ఈ రేంజ్ విజయాలను సాధించొచ్చా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇలా తాజా ఇంటర్వ్యూ లో ప్రశాంత్ నీల్ ... ఉపేంద్ర దర్శకత్వంపై ప్రశంశల వర్షం కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pn