హీరో రజనీకాంత్ సినిమాలలో సూపర్ స్టార్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే రియల్ లైఫ్ లో మాత్రం ఆయన ఎంతో సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు.. రజనీకాంత్ కి ఆధ్యాత్మిక చింతన కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రజల పట్ల ఎంతో అభిమానం ఉన్నటువంటి రజనీకాంత్ రాజకీయాలలోకి రావాలని కూడా అనుకున్నారు. అయితే తన అనారోగ్య సమస్యల కారణంగా మళ్ళీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.. తన రాజకీయ పార్టీని సమాజ సేవా సంఘ్ మార్చడం జరిగింది రజనీకాంత్..


ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటున్నారు రజినీకాంత్ ఇటీవల పేదల కోసం ఒక సూపర్ స్పెషల్ ఆసుపత్రిని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.. ఇటీవల తమిళనాడులోని చంగల్పట్టు జిల్లా తిరువూరులో పర్యటించగా అక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించిన రజనీకాంత్ తాను కొనుగోలు చేసినటువంటి 12 ఎకరాల భూమిని సైతం రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది.ఈ 12 ఎకరాల స్థలంలో రజనీకాంత్ ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


చెన్నై తిరుపూర్ మధ్య 45 కిలోమీటర్ల మధ్య దూరం ఉందని చెన్నై తిరుపూర్ మధ్య 12 ఎకరాల భూమిని సైతం రజనీకాంత్ కొనుగోలు చేయడంతో అక్కడ ఆసుపత్రి నిర్మించడానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. పక్కా ప్రణాళికతోనే ఈ హాస్పిటల్ లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది రజినీకాంత్.. మరి కొద్ది రోజులలో ఈ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ కూడా జరగబోతుందట.. పేదల కోసం రజనీకాంత్ ఆసుపత్రి నిర్మించి ఉచితంగా వైద్యం చేయించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది లాల్ సలామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్లాప్ గాని మిగిలింది.. ప్రస్తుతం డైరెక్టర్ జ్ఞానవేలు దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు జైలర్-2 సినిమాలో కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: