దర్శకుడు సుకుమార్ శిష్యుడుగా అనేక సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు తన మొదటి సినిమా ‘ఉప్పెన’ తో సంచలనాలు సృష్టించాడు. ఆసినిమా ఘనవిజయంతో పాపులర్ డైరెక్టర్ గా మారిన బుచ్చిబాబుకు అనేక సినిమాలు తీసే అవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరించి తాను ఎవరో ఒక టాప్ హీరోతో సినిమా చేయాలి అన్న పంతం వల్ల ఈదర్శకుడుకి మూడు సంవత్సరాలు విలువైన కాలం కరిగిపోయినా పెద్దగా పట్టించుకోలేదుదీనితో బుచ్చిబాబు తన కెరియర్ లో అత్యుత్సాహంతో పొరపాట్లు చేస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. చాలకాలం ఒక వెరైటీ కథను క్రియేట్ చేసి ఆకథకు జూనియర్ మాత్రమే సరిపోతాడు అంటూ ఆకథను పుచ్చుకుని జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించడమే కాకుండా ఆమూవీకి ‘పెద్ది’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈకథ జూనియర్ కు నచ్చడంతో అతడు కూడ ఓకె చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుంది అని భావించారు.  అయితే జూనియర్ కు ఆలోచనలు మారి ఈమూవీ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడటంతో బుచ్చిబాబు రామ్ చరణ్ వైపు వెళ్ళడం అతడు ఒక కథ కు జరిగిపోయింది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా జాహ్నవీ కపూర్ ఉండితీరాలి అని బుచ్చిబాబు పట్టుదలతో ఉండటంతో చివరకు ఆ విషయంలో కూడ ఈ దర్శకుడి పట్టుదల నెగ్గి ఆమె కూడ ఈ ప్రాజెక్ట్ లోకి వస్తున్నట్లుగా అధికార ప్రకటన రావడంతో ఈమూవీ షూటింగ్ ప్రారంభం కాకుండానే నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ న్యూస్ గా మారింది.ఇది చాలదు అన్నట్లుగా ఈ మూవీకి రెహమాన్ సంగీత దర్శకుడుగా వచ్చి చేరడంతో ఈమూవీ పై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ షూటింగ్ ఈ సమ్మర్ లోనే ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది. అన్నీ అనుకున్నావు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీని వచ్చే సంవత్సరం దసరా కు విడుదల చేయాలని నిర్మాతల ప్లాన్ అని అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: