ప్రతి వారం లాగానే ఈ వారం కూడా తెలుగు భాషలో కొన్ని సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ సినిమాలు ఏవి ..? ప్రస్తుతం అవి ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

తేజ సజ్జ హీరో గా అమృత అయ్యార్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ ప్రస్తుతం "జీ 5" ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉండగా ... హిందీ వర్షన్ జియో సినిమాలు "ఓ టి టి"  ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మమ్ముట్టి తాజాగా భ్రమయుగం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మొదట మలయాళం లో విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత తెలుగు లో కూడా విడుదల అయింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మలయాళం , తెలుగు , తమిళ  , కన్నడ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

మార్కర్ ముబారక్ అనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ  , హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

తుండు అనే సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫాం మలయాళం  , తెలుగు , తమిళ , కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: