కరోనా తర్వాత చాలా మంది ఉద్యోగం చేయడం కంటే చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకోవడమే మంచిదని యువత ఎక్కువగా ఆలోచిస్తున్నారు.. అందుకే చాలామంది సొంతంగానే బిజినెస్ లను మొదలు పెట్టాలని చూస్తున్నారు. అంతేకాకుండా వీరితోపాటు మరి కొంతమంది ఉపాధి కల్పించాలని కూడా చూస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలను ఎంచుకోవడం వల్ల మంచి లాభాలను కూడా ఆర్జించవచ్చు. అయితే నగరాలలో ఎలాంటి వ్యాపారానైనా చేసుకోవచ్చు కానీ మరి గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి వ్యాపారాలు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


1). టెంట్ హౌస్:
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎలాంటి చిన్న ఫంక్షన్స్ జరిగిన కచ్చితంగా వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు.. అలాగే సప్లయర్ సామాన్లను కూడా వీటికి జతగా చేర్చుకున్నట్లు అయితే మంచి లాభాలను ఆర్జించుకోవచ్చు. పెళ్లిళ్ల సీజన్లో మంచి లాభాలను కూడా అందిస్తుంది.


2). పాల డైరీ వ్యాపారం:
ఈ మధ్యకాలంలో నాణ్య మైన పాలు దొరకాలి అంటే  చాలా కష్టంగా ఉంటోంది. అందుకే గ్రామాలలో డైరీ పెట్టి పాల వ్యాపారాన్ని మొదలు పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను కూడా అందుకోవచ్చు.


3). వర్మి కంపోస్ట్:
వర్మి కంపోస్ట్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని అందించే బెస్ట్ బిజినెస్ ఐడియా.. ఈ  వర్మీ కంపోస్ట్ ను రైతులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దీని ధర కూడా తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మోతాదులో వీటిని వినియోగిస్తూ ఉంటారు. వాన పాములను కూడా పిల్లలు పుట్టిన తర్వాత అమ్మడం వల్ల మంచి లాభాలను అందుకోవచ్చు.


4). ఆటో వ్యాపారం:
రైతులకు , చిన్నచిన్న బిజినెస్ వ్యాపారాలకు కచ్చితంగా ఆటో అవసరం.. ముఖ్యంగా ఏవైనా లగేజ్ లను తరలించాలన్న పిండి మూటలు ఇంటి దగ్గరికి చేర్చుకోవాలని ఖచ్చితంగా లగేజీ ఆటో అవసరం పడుతుంది పల్లెలలో వీటి అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది కనుక వీటి బిజినెస్ పెట్టుకున్న మంచి లాభాలే.. ఇవే కాకుండా రైస్ మిల్, పిండి మిషన్, డ్రైవింగ్ నేర్పించడం, కోళ్ల వ్యాపారం, పావురేవుల వ్యాపారం ఇతరత్రా వాటిని కూడా చేయవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: