టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ ను అందుకుంది. మొదటి సినిమాతోనే స్టార్ రేంజ్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. ఇక సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ వస్తుంది..తాజాగా అదిరిపోయే స్టిల్స్ తో ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ ఏడాది అమ్మడుకు అంతగా కలిసిరాలేదు.. గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడుకు సినిమా ఆశించిన హిట్ ను అందుకోలేక పోయింది.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారును ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది.కానీ ఈ మధ్య కాస్త కొంచెం గ్యాప్ ఇచింది అమ్మడు. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. రవితేజ హీరోగా రాబోతున్న నెక్స్ట్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందట. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా రీసెంట్ గానే జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి గతంలో ధమాకా సినిమాలో నటించారు.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ ధమాకా సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. భాను భోగవరపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈసినిమా పూజా కార్యక్రమంలో శ్రీలీల కట్టుకున్న చీర ప్రస్తుతం వైరల్ గా మారింది. శ్రీలీల ఈ చీరలో చాలా అందంగా కనిపిస్తున్నారు. సెలబ్రిటీలు మామూలు దుస్తులు వేసుకున్నా కూడా వాటి ధర మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది.ప్రస్తుతం శ్రీలీల కట్టుకున్న చీర ధర కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఈ చీరని ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేశారట. ఈ చీర ధర రూ. 70 వేలు ఉంటుందట. ఇదే చీర ప్రస్తుతం డిస్కౌంట్ పోగా 49 వేల రూపాయలకి అందుబాటులో ఉంది. చీర చూడడానికి చాలా సాధారణంగా ఉన్నా కూడా ధర మాత్రం చాలా ఉంది. డిజైన్ కూడా మామూలుగానే ఉంది. ఇంత సింపుల్ గా ఉన్న ఈ చీర కాస్ట్ విని అందరూ షాక్ అవుతున్నారు. సాధారణంగా ఇలాంటి చీరలు రెండు వేలకు మించి ఉండవు అంటున్నారు నెటిజన్లు.వెయ్యి రూపాయల లోపే ఇలాంటి సింపుల్ గా ఉన్న చీరలు లభిస్తాయి. మెటీరియల్ చాలా బాగుంటే, రూ. 2000 ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఉండే అవకాశం లేదు అంటున్నారు నెటిజన్లు. కానీ చీర ధర మాత్రం ఎక్కువ ఉందనే కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: