టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.ఈ ఏడాది విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ అంతగా ఆకట్టుకోకపోవడం తో విజయ్ ఈసారి సరికొత్త కథాంశం తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ప్రస్తుతం విజయ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో  శర వేగంగా జరుగుతుంది ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ,స్టార్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ  "గీతా గోవిందం " ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమా లో విజయ్ దేవర కొండ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ,రష్మిక పెయిర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా తెరకెక్కిన గీతా గోవిందం కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా కు గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు.ఈ సినిమా లో గోపి సుందర్ అందించిన సాంగ్స్ ప్రేక్షకులను విపరీతం గా ఆకట్టుకున్నాయి.ఈ సినిమా లో "ఇంకేం ఇంకేం కావాలే"సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ మిలియన్ వ్యూస్ సాధించి టాప్ ట్రేండింగ్ లో నిలిచింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ పాటకు అరుదైన గౌరవం దక్కింది.పారిస్ ఒలింపిక్స్ వచ్చే నెల 26 న మొదలవుతున్నాయి.దీనితో ఒలింపిక్స్ అధికారిక ఇన్స్టా పేజీ ఆ పాట ను తన ప్రమోషనల్ వీడియో లో వాడింది.దీనిపై హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ 'కొన్ని పాటలు ఎప్పటికి గుర్తుండిపోతాయి 'అంటూ  ఆ వీడియోను షేర్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: