పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్పి మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కెరియర్ లోనే ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ ని తెరకెక్కించారు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీఫై ఇటీవల విడుదలైన ట్రైలర్లు అయితే అంచనాలను రెట్టింపు చేసేసాయి అని చెప్పాలి   జూన్ 27వ తేదీన ఈ సినిమా విడుదలవుతూ ఉండగా.. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది.


 అయితే ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు చూసిన తర్వాత హాలీవుడ్ సినిమాను తలదన్నే రేంజ్ లో కల్కి మూవీ ఉండబోతుందని అటు ప్రేక్షకులు అందరూ కూడా భావిస్తున్నారు. అయితే ఈ మూవీలో కీలకపాత్రలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దిశా పఠాని లాంటి ప్రముఖులు నటిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ సినిమా ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ బడ్జెట్ లో సగం కి పైగా ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ కి అయిందట. ఈ క్రమంలోనే కల్కి మూవీ కోసం అటు ప్రభాస్ కూడా భారీగానే పారితోషకం పుచ్చుకున్నాడట.


 ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి 150 కోట్ల వరకు ఈ కల్కి సినిమా కోసం పారితోషకం అందిందట. అలాగే ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక లాంటి ముగ్గురుకి కూడా 15 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారు అన్నది తెలుస్తుంది. ఇక మరో హీరోయిన్ దిశా పఠాని ఐదు కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇలా దాదాపు బడ్జెట్లో 200 కోట్ల పైగానే అటు నటీనటుల రెమ్యూనరేషన్ అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అటు గ్రాఫిక్స్ కోసం కూడా నాగ్ అశ్విన్ భారీగానే ఖర్చు పెట్టాడట. మరి ఈనెల 27వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: