సమంతాతో విడాకులు తెలుసుకున్నాక నాగ చైతన్య సింగల్ గానే ఉంటున్నాడు. వరుస సినిమాలతో కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కేందుకు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ గత కొన్ని నెలలుగా చైత్యన్య ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని పలు రకాలు వార్తలు వినిపించాయి. ఆ విషయమై పలు ఇంటర్వ్యూ లలో ప్రశ్నించగా ఆ వార్తలను కొట్టి పారేసాడు. కానీ ఇప్పుడు ఆ వార్తలు నిజం చేస్తూ నాగ చైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ నిన్న (ఆగస్టు 8న ) సైలెంట్ గా జరిగిపోయింది. కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆ ఫోటోలను నాగార్జున తన సోషల్

 మీడియాలో షేర్ చేశారు. దాంతో నాగ చైతన్య, శోభితకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు, ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తన మాజీ భర్తకు మరో నటితో నిశ్చితార్థం జరగడంతో సమంత ఎలా స్పందిస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రోజు సమంతా రూత్ ప్రభు వేరే కారణంతో హార్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేసింది. ఆగస్ట్ 8న, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది.  ఇకపోతే కొన్ని సంవత్సరాల ప్రేమాయణం తర్వాత నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల ఈ రోజు

 నిశ్చితార్థం చేసుకున్నారు. శోభితతో వైవాహిక జీవితం పంచుకోబోతున్నాడు చైతన్య.  అక్కినేని నాగార్జున, అఖిల్, అమలతో పాటు, ధూళిపాళ్ల కుటుంబాలకు చెందిన ముఖ్యులు, దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అతి కొద్దీ మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆడంబరానికి దూరంగా సాంప్రదాయాలకు దగ్గరగా వేదపండితుల సమక్షంలో ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది. ఈ వేడుకకు నాగ చైతన్య తల్లి లక్ష్మి కూడా హాజరయినట్టు తెలుస్తోంది. కొన్ని కారణాల రీత్యా ఎంగేజ్‌మెంట్‌కు మీడియాను అనుమతించలేదు. త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసి వెల్లడించనున్నట్టు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: