మెగాస్టార్‌ , టాలీవుడ్‌ స్టార్‌ హీరో చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరు తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎంతోమంది స్టార్ హీరోయిన్ లతో పోటీపడి మరి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరంజీవి తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎంతో మంది దర్శక నిర్మాతలకు, హీరోయిన్లకు అవకాశాలని ఇచ్చారు. తన సినిమాలు ద్వారా ఎంతో మంది దర్శకనిర్మాతలు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.


హీరోయిన్లు కూడా స్టార్ హీరోయిన్లుగా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. చెరువుకి కోట్లాది సంఖ్యలో అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ చిరంజీవి సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. తన అభిమానుల కోరిక మేరకే చిరంజీవి సినిమాలలో నటిస్తున్నారు. అయితే చిరంజీవి ఇప్పటికీ సినిమాలలో నటిస్తుండడం విశేషం.


ఇదిలా ఉండగా.... ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకొని నాకు విజయాన్ని అందించిన నా హీరోయిన్లు అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని రాసకొచ్చారు.


తన భార్య సురేఖతో పాటు హీరోయిన్లు రాధిక, కుష్బూ, సుహాసిని, జయసుధ, మీనాలతో కలిసి ఫోటోను దిగి ఆ ఫోటోను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి పోస్ట్ చేసిన ఈ ఫోటో విపరీతంగా వైరల్ గా మారుతుంది. ఈ ఫోటో చూసిన చాలామంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా... టాలీవుడ్‌ స్టార్‌ హీరో చిరంజీవి  త్వరలోనే  అనిల్‌ రావిపూడి తో సినిమా చేయబోతున్నాడు. ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: