తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్లో ఎన్నో సినిమాలను నిర్మించాడు. అందులో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోగా కొన్ని సినిమాలు భారీ అపజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే తాను నిర్మించిన ఓ ఫ్లాప్ సినిమా కథను చిరంజీవి ముందే జడ్జి చేసి ఆ మూవీ వర్కౌట్ కాదు అని చెప్పినట్లు దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పకచ్చాడు. అసలు ఏ సినిమా విషయంలో చిరంజీవి ... దిల్ రాజు మధ్య ఈ సంభాషణ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నాకు వాసు వర్మ "జోష్" మూవీ కథను వినిపించాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ మూవీ చరణ్ పై అద్భుతంగా ఉంటుంది అని నాకు అనిపించింది. దానితో వెంటనే నేను చిరంజీవి గారిని కలిసి ఆ మూవీ కథను ఆయనకు వినిపించాను. కథ మొత్తం విన్న ఆయన కొంత టైమ్ తీసుకుని నిర్ణయం చెబుతాను అన్నాడు. కొన్ని రోజుల తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేసి ఆ మూవీ చరణ్ ఫై వర్కౌట్ కాదు. వేరే వారిపై వర్కౌట్ అవుతుందేమో మీరే చూడండి అని చెప్పాడు. దానితో నేను ఆ కథ విషయంలో చాలా డైలమాలో పడిపోయాను. అనేక మంది కి ఆ కథను ఆ తర్వాత వినిపించాను. విన్న వారంతా స్టోరీ సూపర్ గా ఉంది.

హిట్ అవుతుంది అన్నారు. దానితో నాగ చైతన్య ను ఆ మూవీతో ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ మూవీ కథను నాగార్జున గారికి వినిపించాను. నాగ చైతన్య మొదటి సినిమా బాధ్యతలను నాగార్జున మాకు అప్పగించాడు. సినిమా పూర్తి అయింది. విడుదల అయింది. ఆ మూవీ మేము అనుకున్నా స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత చిరంజీవి గారు చెప్పింది నిజం అయింది అని అనిపించినట్లు దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: