టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కింగ్డమ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా టైటిల్ టీజర్ కి హిందీలో రన్ బీర్ కపూర్, తమిళ్ లో సూర్య, తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు.రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు..

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాగా కింగ్డమ్ సినిమా రూపొందుతుంది.గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను శ్రీలంక సరిహద్దుల్లోని శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నాడు.ఈ బిగ్గెస్ట్ పీరియాడిక్ డ్రామా రెండు భాగాలుగా ఉంటుందని మేకర్స్ తెలిపారు... ఈ సినిమాలో విజయ్ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.మే 30 న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిపారు.. ఈ వారంలో నే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు..అనిరుధ్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ తో ఆ సాంగ్ సాగనున్నట్లు తెలుస్తుంది..గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో వున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు..ఈ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా వైడ్ విజయ్ గ్రాఫ్ మరింత పెరుగుతుంది.. వరుస హిట్స్ అందుకోవాలనే ఉద్దేశంతో విజయ్ మూవీ స్క్రిప్ట్ పై ఎంతో శ్రద్ద పెట్టి ఓకే చేస్తున్నాడు..దీనితో ఇంట్రెస్టింగ్ స్టోరీ కే విజయ్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: