- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రభుదేవా డాన్స్ కొరియోగ్రాఫర్ గా.. నటుడిగా.. దర్శకుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఇలా ఇండస్ట్రీలో ఆల్ రౌండ‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. అప్ప‌ట్లో ప్ర‌భుదేవా - న‌య‌న‌తార ప్రేమ వ్య‌వ‌హారం సెన్షేష‌న‌ల్‌. న‌య‌న‌తార వ‌ల్లే త‌న కాపురం కూలిపోయిందంటూ ప్ర‌భుదేవా మొద‌టి భార్య ర‌మ‌ల‌త్ ఇప్ప‌ట‌కీ ఆమెకు శాప‌నార్థాలు పెడుతూనే ఉంటుంది. ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్న నయనతార - ప్రభుదేవా ఎందుకు ? పెళ్లి చేసుకోలేకపోయారు.. దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. న‌య‌న‌తార - ప్ర‌భుదేవా మ‌ధ్య ప్రేమ చిగురించి ఘాడంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకునే వ‌ర‌కు వెళ్లింది. ఈ జంట‌ పెళ్లి చేసుకోకుండానే సహజీవనం కూడా చేశారు.


అయితే వీరి బ్రేక‌ప్‌కు ఓ బ‌ల‌మైన కార‌ణం  ఉంద‌ట‌. అది ఏదో కాదు ప్ర‌భుదేవా - ర‌మ‌ల‌త్ పిల్ల‌లు. ఈ పిల్ల‌ల విష‌యంలోనే వీరి మ‌ధ్య బంధం బ్రేక్ అయిందట. పిల్ల‌లు త‌మ‌తోనే ఉండాల‌ని ప్ర‌భుదేవా చెప్పినా అందుకు న‌య‌న‌తార ఒప్పుకోలేద‌ట‌. ఈ విషయంలో పెళ్లయ్యాక కూడా ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని ప్రభుదేవా అనుకున్నారో ఏమో తెలియదు కానీ నయనతారకు బ్రేకప్ చెప్పేశాడ‌ని టాక్ ? అందుకే ప్ర‌భుదేవా త‌న‌ను ప్రేమించి మ‌రీ మోసం చేశాడ‌ని ఆమె వాపోయింద‌ట‌. ఆ త‌ర్వాత ఆమె ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుంది. ఇక  ప్రభుదేవా హిమానీ సింగ్ అనే ఓ ఫిజియో థెరపిస్టుని పెళ్లి చేసుకున్నారు. వీరికి గత ఏడాది ఓ పాప కూడా పుట్టింది.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: