ఏపీ మంత్రి నారాయణ కుమార్తె మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కోడలు శరణ్య రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. జీవితం ఏమవుతుందో అనే అభద్రతాభావంతో ఉండడం కంటే నేను సాధించగలనని మైండ్ సెట్ చేసుకుని ఎక్కువ దృష్టి పెట్టాలి. నేను అక్కడే సక్సెస్ అయ్యా అని చిరంజీవి చెప్పారు. మైండ్ సెట్ కు షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం అని చిరంజీవి సూచించారు. చంద్రబాబు ధీరోధాత్తుడు అని .. అలిపిరి దాడి ఘటనలో పడి లేచిన ఆయనలో ఎంతో మానసిక ధైర్యం చూశానని కొనియాడారు. శ‌ర‌ణ్య‌ రచించిన మైండ్ సెట్ షిఫ్ట్‌ పుస్తక ఆవిష్కరణ సభకు హాజరైన చిరంజీవి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. జీవితం పూలపంపు కాదు ప్రతి చో ట ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయినా విజయం కోసం ప్రయాణం చేయాలని మన ప్రయాణంలో ఎన్నో ఊహించిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.. విధ్వంసాలు, నిరుత్సాహం, నిరుత్సాహపరచటం ఇలా ఎన్ని ఉన్నా వాటిని ఢీకొట్టాలంటే చిత్తశుద్ధి ఎంతో ముఖ్యం ఎక్కడ బెదరకూడదని చిరంజీవి తెలిపారు.


చాలామందికి మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలో తెలియటం లేదు .. గురువులు చెప్పటం లేదు ఒకేలా కష్టపడుతూ గానుగ ఎద్దులా జీవితం వెళ్ల‌దీస్తారు .. ఈ జన్మకి ఇది చాలు అనుకుంటూ జీవితం ముగిస్తారు అది సరైనది కాదు ఆలోచన విధానం మార్చుకుని కష్టపడే మనస్తత్వంతో ఇష్టమైన ప్రొఫెషన్ లో ఉంటే ఒక స్థాయిలో రాణించవచ్చని చిరంజీవి తెలిపారు. తను చదువుకునే సమయంలో డ్రామా వేస్తే అవార్డులు వచ్చాయి .. సినిమా రంగంలోకి వస్తే నువ్వు ఏమైనా గొప్ప అందగాడు అన్నారు .. కానీ పట్టుదలతో పగలంతా ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుని రాత్రి కళాశాలలో చదువుకున్నానని ఆ తర్వాత క్రమంగా సినిమా అవకాశాలు వచ్చాయని .. ప్రతిసారి తనను తాను ఉత్తమంగా నిరూపించుకుంటూ ప్రయాణం సాగించా ... హీరోగా ఇదే సమయంలో కొందరు నిర్మాతలు తక్కువ స్థాయి పాత్రలు రౌడీ వేషాలు వేయమని అడిగారు .. కానీ లోపల ఒకటే ధైర్యం తో త‌న‌ను తాను నిరూపించుకున్నాను అని చిరంజీవి తెలిపారు .


చంద్రబాబులో ధీరోదాత్తత చూసానని ప్రతికూల పరిస్థితులు వచ్చిన వాటిని అధిగమించేలా మంచి రోజులు వస్తాయని నమ్మకంతో ముందుకు వెళ్లాలి అనేందుకు నిదర్శనమే చంద్రబాబు .. ఆయన తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ రంగంలో ఎప్పుడు రాణించాలని తప్పించేవారు .. కాలేజీ రోజుల నుంచి మంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగారు. రాష్ట్రానికి సేవ చేయగలరని ఆలోచనతో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఎదిగారని చిరంజీవి ప్రశంసలు వర్షం కురిపించారు. హైదరాబాద్ ఐటీ రంగంలో ఎంత అభివృద్ధి చెందింది అంటే మార్గదర్శకుడు చంద్రబాబు అని చిరంజీవి కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: