
హిట్ 3 సినిమా రిలీజ్ కి ముందే ఒక డిఫరెంట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇప్పటిదాకా సాఫ్ట్ రోల్స్ లో కనిపించిన నాని ఇప్పుడు మాస్ రోల్ లో మళ్లీ కనిపించనున్నారు. ఇప్పటికే దసరా, సరిపోదా శనివారం సినిమాతో నానిని మాస్ రోల్ లో చూశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ అందరూ మాస్ పాత్రలో నాని పాత్రని మరోసారి చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులకు హిట్ 3 సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాలో హింస ఎక్కువగా ఉన్న కారణంగా సెన్సార్ సభ్యులు హిట్ సినిమాకు ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. 13 సంవత్సరాల లోపు పిల్లలు ఈ సినిమాను చూడకూడదని సెన్సార్ సభ్యులు స్పష్టం చేశారు.
ఇటీవలే నాని నిర్మాతగా కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రోషన్, శ్రీ దేవి ప్రధాన పాత్రలో నటించారు. అలాగే నటుడు ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ సహాయక పాత్రలను పోషించారు. కోర్ట్ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ముఖ్యంగా పోక్సో చట్టం గురించి లోతుగా తెలిజేయడం కోసం తీసింది. కోర్ట్ సినిమాలో ఫస్ట్ ఆఫ్ మొత్తం టీనేజ్ ప్రేమ కథను చూపించారు. సెకండాఫ్ మొత్తం కోర్ట్ సీన్స్ ఉంటాయి. సినిమాలో చందు పాత్రలో రోషన్, జాబిలి పాత్రలో శ్రీదేవి బాగా నటించారు. వీరిద్దరూ ఈ సినిమాలో ప్రేమించుకుంటారు.