న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.  ప్రస్తుతం నాని హిట్ 3 సినిమాతో త్వరలో థియేటర్ లో రిలీజ్ కానుంది. మేలో హిట్ 3 సినిమా విడుదల ఉండడంతో మూవీ ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాని చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని ఓ ఇంటర్వ్యూలో తన మొదటి పారితోషికం ఎంతో చెప్పుకొచ్చారు. తను నిర్మాత అయ్యాక తీసుకున్న రెమ్యూనిరేషన్ గుర్తులేదు అని అన్నారు. కానీ నాని నటుడిగా తీసుకున్న మొదటి పారితోషికం 4000 రూపాయలు అని తెలిపారు. దానికంటే ముందు ఒక సినిమాకు వర్క్ చేసినప్పుడు తనకి 2500 రూపాయలు చెక్ ఇచ్చారని చెప్పారు. అయితే ఆ చెక్ బౌన్స్ అయిందంట.. దాన్ని ఇప్పటికీ కూడా నాని దాచిపెట్టుకున్నట్లు తెలిపారు.
 
హీరో నాని ఇటు హీరోగా మూవీస్ లో నటిస్తూనే.. అటు నిర్మాతగా సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీకి హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఇప్పటికే హిట్ 1, హిట్ 2 రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాయి. దీంతో వచ్చే నెల 1న హిట్ 3తో హీరో నాని ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమాకు తాజాగా సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. 


ఇక ఇటీవలే స్టార్ హీరో నాని నిర్మాతగా కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రోషన్, శ్రీ దేవి ప్రధాన పాత్రలో నటించారు. అలాగే నటుడు ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్ సహాయక పాత్రలను పోషించారు. ఈ సినిమా ముఖ్యంగా పోక్సో చట్టం గురించి లోతుగా తెలిజేయడం కోసం తీసింది. ఈ సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్ లను కూడా రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: