టాలీవుడ్ లో ఢీ షో కి జడ్జిగా కొరియోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించిన శేఖర్ మాస్టర్ ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. అయితే ఈ మధ్యకాలంలో తన డాన్స్ స్టెప్పులతో విపరీతంగా విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. డాకు మహారాజ్ , రాబిన్ హుడ్ చిత్రంలో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులు చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ చాలామంది విమర్శలు చేశారు. వీటన్నిటిని పక్కన పెడితే ఇటీవలే ఒక మహిళ డాన్సర్ విషయంలో కూడా శేఖర్ మాస్టర్ ప్రవర్తించిన తీరు చాలామంది ట్రోల్ చేసేలా మారాయి.


సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉండడంతో తాజాగా వీటన్నిటి పైన శేఖర్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా సాంగ్స్, కాంట్రవర్సీ, హుక్ స్టెప్పుల మీద ట్రోలింగ్ అన్నిటి పైన మాట్లాడుతూ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో తనకి కాస్త టెన్షన్ ఉంటుందని టీవీ కార్యక్రమాలకు వచ్చేసరికి అలాంటివేవీ ఉండదని తెలిపారు. జడ్జ్ గా షోలకు వ్యవహరించడం కాస్త రిలాక్స్ గా అనిపిస్తుందని అందులో భాగంగానే ఒక డాన్స్ షో కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మహిళా డాన్సర్ విషయంలో చాలా విమర్శలు ఎదురయ్యాయి.. నిజంగా చెప్పాలి అంటే ఆ సీజన్లో పాల్గొన్న మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే ఆమె కొంతమేరకు డాన్స్ బాగానే చేసిందనిపించింది. అందుకే ఆమెను మెచ్చుకున్నానని కానీ కొంతమంది చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు శేఖర్ మాస్టర్.


టాలెంట్ ఉండే వాళ్లను ఎంకరేజ్ చేయడం తప్ప? చివరికి తన వల్లే విన్నర్ అయింది అంటూ కూడా సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ పెట్టడం చూసి ఈ విషయం తనని చాలా బాధకు గురి చేసిందని తెలిపారు. నిజం చెప్పాలంటే ఆ షో తర్వాత ఆమె ఎవరో కూడా తనకు తెలియదని వెల్లడించారు శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ మాట్లాడిన వీడియో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: