నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్ కు యూత్ ఎంతగానో కనెక్ట్ అవుతారు. ఇక బాలయ్య బాబు తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం పొందారు. తన సినిమాల ద్వారా బాలకృష్ణ ఎంతో మంది హీరోయిన్లను, దర్శకనిర్మాతలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే వారిని గొప్ప స్థాయిలో నిలిపారు. బాలకృష్ణ వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 

ఈ క్రమంలోనే ఈ హీరో నటిస్తున్న తాజా చిత్తం అఖండ-2. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. అంతేకాకుండా మరో హీరోయిన్ ను కూడా ఈ సినిమాలో అనుకుంటున్నారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఈ చిన్నదానికి అఖండ-2 సినిమాలో స్పెషల్ పాత్ర ఉంటుందని సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో చిందులు వేయనుందట. ఇప్పటికే ఆ పాత్ర కోసం ఊర్వశిని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది.

ఇక త్వరలోనే ఈ చిన్నదానితో షూటింగ్ సన్నివేశాలను చిత్రీకరించాలని ప్లాన్ లో ఉన్నారట దర్శకుడు బోయపాటి శ్రీను. ఇక ఊర్వశి రౌతేలా, బాలయ్య బాబు మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయని కూడా సినీ వర్గాల్లో సమాచారం అందుతోంది. ఇక బాలకృష్ణ ఈ సినిమాలో ఊర్వశి రౌతేలతో కలిసి నటించబోతున్నారు. అఖండ-2 సినిమాను సంక్రాంతికి సందర్భంగా రిలీజ్ చేయాలని బాలయ్య, బోయపాటి శ్రీను అనుకుంటున్నారట. అందుకే ఈ సినిమా షూటింగ్ ను చాలా వేగంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: