టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమా అనంతరం తెలుగులో వరుసగా సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు సినిమాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలను అందుకుంది. కానీ ఈ చిన్నది ప్రేక్షకుల మనసులను దోచుకున్నప్పటికీ సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. 

తాను నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా మారాయి. ఇక ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేక సతమతమవుతోంది. తెలుగుతో పాటు ఈ చిన్నది తమిళంలోనూ అనేక సినిమాలలో నటించింది. ప్రస్తుతం తమిళంలోనూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది. కృతి శెట్టి తెలుగులో ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తోంది. సినిమాలలో అవకాశాలను రాబట్టడానికి తన గ్లామర్ ఒలకబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. ఒకప్పుడు ఎంతో సాంప్రదాయంగా ఉండే ఈ చిన్నది ఇప్పుడు తన అందాలను ఆరబోస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే నటి కృతి శెట్టికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంది. కృతి శెట్టి ఓ తమిళ రాజకీయ నాయకుడితో ఎఫైర్ కొనసాగిస్తుందట. చాలా సీక్రెట్ గా కొన్ని సంవత్సరాల నుంచి వీరిద్దరూ రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా తమిళ సినీ వర్గాల్లో ఓ వార్త సంచలనంగా మారుతుంది. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నారట. ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ కృతి శెట్టికి సంబంధించిన ఈ వార్త సంచలనంగా మారుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఈ వార్తలపై నటి కృతి శెట్టి ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: