మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి వారసుడిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తనకంటూ ప్రత్యేకమైన పేరు, ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 

ఈ సినిమాలో దర్శకత్వం అసలు బాగోలేదని అభిమానులు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రామ్ చరణ్ తన తదుపరి సినిమా షూటింగ్ లో చాలా త్వరగా పాల్గొన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబినేషన్లో పెద్ది సినిమాను తీస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాలోని షాట్ ను డీసీ ప్లేయర్ సమీర్ రిజ్వి రీ క్రియేట్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారుతుంది.

 తాజాగా ఈ వీడియోపై రామ్ చరణ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. పెద్ది షాట్ ను రీ క్రియేట్ చేసినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు డీసీ ఆడనున్న మ్యాచ్ లో విజయం సాధించాలని ఎంతగానో కోరుకుంటున్నానని రామ్ చరణ్ అన్నారు. అలాగే పెద్ది షాట్ రీ క్రియేట్ వీడియోను రామ్ చరణ్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ వీడియోని చూసిన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: