టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి భాగ్యశ్రీ బోర్సే ఒకరు. ఈ భామ మొదటి సినిమా తోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. హీరో రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా వల్ల కేవలం భాగ్యశ్రీకి మాత్రమే అదృష్టం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. 

సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. మిస్టర్ బచ్చన్ సినిమా అనంతరం భాగ్యశ్రీ తో వరుసగా సినిమాలు తీయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం భాగ్యశ్రీ వరుస సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే భాగ్యశ్రీ బోర్సే, హీరో రామ్ పోతినేని మధ్య రిలేషన్ కొనసాగుతున్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ ప్రస్తుతం పలు సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి త్వరలోనే ఓ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారట.

ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను అతి త్వరలోనే ప్రారంభించాలని దర్శకుడు నిర్ణయం తీసుకున్నారట. రామ్ నటించబోయే 22వ సినిమాలో ఈ చిన్నదానికి హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఇచ్చినట్టుగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నట్లు అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ వీరిద్దరూ కనుక వివాహం చేసుకుంటే చాలా బాగుంటుందని వారి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి సినిమా తీస్తే మంచి విజయాన్ని అందుకుంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: