
అయితే రజినీకాంత్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరు. ప్రస్తుతం రజనీకాంత్ ఒక్కో సినిమాకు అక్షరాల రూ.180 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. త్వరలో రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా రాబోతుంది. అక్కినేని నాగార్జున కీలక రోల్ ప్లే చేస్తుండడంతో ఈ సినిమాపై ఆడియెన్స్‌కు అంచనాలు భారీగా పెరిగాయి. ఉపేంద్ర, నటి శృతి హాసన్ ఈ మూవీలో ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ 14న థియేటర్ లలో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రజినీకాంత్ చరిత్ర సృష్టించారు. అదేంటంటే.. ఈ సినిమాలో నటించడానికి రజినీకాంత్ రూ. 260 నుండి 280 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు స్పష్టం అయ్యింది. అంతే కాదు ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించనున్న నాగార్జున కూడా రూ. 24 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాతో రజినీకాంత్ ఆసియాలోనే ఎక్కువ పారితోషికం తీసుకున్న నటుడిగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రజినీకాంత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.