సినిమా అంటే మనకు మొదట డైరెక్టర్ లే గుర్తొస్తారు. ఎందుకంటే సినిమాకు ప్రాణం పోసేదే డైరెక్టర్లు కాబట్టి. ఒకప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ లు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెరపైకి తీసుకువచ్చి ప్రేక్షకులను మెప్పించేవారు. అప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ లకు పెద్దగా ప్రాముఖ్యత ఉండకపోయేది. కానీ ఇప్పుడు మాత్రం టాలీవుడ్ డైరెక్టర్ లు సినిమాని ఏలుతున్నారు. ముఖ్యంగా కొంతమంది కొత్త డైరెక్టర్ లు అయితే తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నారు. వాళ్లు తీసుకొచ్చే కంటెంట్ తెలుగు ప్రేక్షకులనే కాదు ఇతర భాష ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతం ఒక ఆరుగురు డైరెక్టర్ లే టాలీవుడ్ ని ఎలుతున్నారు. ఆ ఆరుగురు స్టార్ డైరెక్టర్ లు కూడా తెలంగాణ నుండి వచ్చిన వాళ్లే. మరి ఆ స్టార్ డైరెక్టర్లు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.
 
టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే తెలియని వారుండారు. ఈయన అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఇటీవల యానిమల్ సినిమాతో కూడా సందీప్ రెడ్డి వంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టేశారు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అటు బాలీవుడ్ లో.. ఇటు టాలీవుడ్ లోనూ మస్తు క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి పరిచయం అనవసరం. ఈయన సినిమాలంటే చాలు ప్రేక్షకులు థియేటర్ లలోకి పరుగులు పెడతారు. తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సినిమాతో మంచి హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మరోసారి మంచి గుర్తింపుని పొందారు. ఆ తర్వాత పిట్టకథలు, క్రీడ కోలా సినిమాలను కూడా తెరపైకి తీసుకువచ్చారు.


హాస్యనటుడు వేణు గురించి అందరికీ తెలుసు. ఈయన బలగం సినిమాతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. ఒక సినిమాతో వేణు డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.  డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత మహానటి సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. ఇటీవలే కల్కి సినిమాతో మంచి హిట్ ని సొంతం చేసుకొని స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మిరపకాయ, గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. గబ్బర్ సింగ్ సినిమాతో ఈయన ఇమేజ్ యే మారిపోయింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుని భారీ వసూళ్లను కూడా రాబట్టాడు. ఈ ఆరుగురు డైరెక్టర్లు మన తెలంగాణకు చెందిన వాళ్లే అవ్వడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: