కోలీవుడ్, టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరు పొందిన రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తోనే సినిమాలలో నటిస్తూ ఉన్నారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూలీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రజినీకాంత్.. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయిందట. ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.  అయితే ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల రూపాయలు అన్నట్లుగా సమాచారం. కానీ ఇందులో రజనీకాంత్ రెమ్యూనరేషన్ తెలిసి ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


రజనీకాంత్ ఈ సినిమా కోసం 260 కోట్ల రూపాయలు తీసుకున్నారని, డైరెక్టర్ లోకేష్ కనకరాజు 60 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కూలీ సినిమాలో భారీ తారగణం కూడా నటిస్తూ ఉన్నది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున తో పాటు ఉపేంద్ర, సత్యరాజ్ తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు. అలాగే శృతిహాసన్ కూడా నటిస్తూ ఉన్నది. రజనీకాంత్ ప్రస్తుతం 72 సంవత్సరాలు వయసు కలిగినప్పటికీ కూడా అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా పేరు సంపాదించారు.


ఇక నాగార్జున కూడా తన పాత్ర కోసం రూ.20 కోట్లకు పైగా తీసుకున్నారని,  ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పూజా హెగ్డే ఇందులో  స్పెషల్ సాంగ్ కోసం 2 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు సమాచారం. మరి ఇంతటి భారీ బడ్జెట్ కలిగిన ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూలి సినిమానే కాకుండా జైలర్ 2 సినిమాలో కూడా హీరో రజనీకాంత్ నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: