నటుడు శివాజీ రాజా అంటే తెలియని వారు ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈయన  ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించారు.అయితే అలాంటి శివాజీ రాజా తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.అందులో భాగంగా తన లవ్ మేటర్ కూడా చెప్పారు. శివాజీ రాజా  ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. నాకు ఓ లవ్ స్టోరీ  ఉంది. ముంబైకి చెందిన మోడల్ అంటే నాకు ఎంతగానో ఇష్టం.కానీ ఈ విషయం నా భార్యకు నచ్చదు..ఇక నేను అంతలా ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరంటే వాషింగ్ పౌడర్ నిర్మా అనే యాడ్ లో తెల్ల చీర కట్టుకొని వచ్చే మోడల్.ఆమె అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. 

అయితే ఈ విషయం మా ఆవిడకు తెలుసు. అందుకే వాషింగ్ పౌడర్ యాడ్ లో వచ్చే అమ్మాయిని అస్సలు ఇష్టపడదు. మా ఆవిడకు ఆమె అంటే  ఇప్పటికి నచ్చదు. ఇక నాకు విపరీతమైన సిగరెట్ తాగే అలవాటు ఉండేది.రోజుకి ఎన్ని సిగరెట్స్ కాలుస్తానో నాకే తెలిసేది కాదు. కానీ మొదటిసారి చిరంజీవి కారణంగా నేను సిగరెట్లు తాగడం మానేశాను. చిరంజీవి మీద ఒట్టేసి మరీ 2000 సంవత్సరంలో ఆయనకు మాటిచ్చాను. ఇప్పటినుండి సిగరెట్లు తాగనని.. ఇక ఆరోజు వేసిన ఒట్టు కారణంగా ఇప్పటికి కూడా ఒక్క అగ్గిపుల్ల కూడా ముట్టుకోలేదు. అలాగే నాకు నక్సలిజం అంటే చాలా ఇష్టం.

గద్దర్ గారి ప్రభావం నా మీద ఎక్కువగా ఉండేది. నక్సలైట్ అవ్వాలి అనుకున్నాను.అయితే చాలామందికి చాలా రకాల కోరికలు ఉంటాయి. అలా కొంతమంది డాక్టర్, ఇంజనీర్, లాయర్ అవ్వాలి అనే కోరికలు ఉంటాయి. కానీ నాకు  మాత్రం నక్సలైట్ అవ్వాలి అనే కోరిక ఉంది. అలాగే ఎలక్షన్స్ వస్తే చాలు చాలామంది నాయకులు ఫ్రీ ఫ్రీ అంటూ ప్రజలను ప్రసన్నం చేసుకుంటారు. నాకు ఇది అస్సలు నచ్చదు.ఇక నేను నక్సలైట్ అయితే ఇప్పటివరకు బతికి ఉండేవాడిని కాకపోవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శివాజీ రాజా.

మరింత సమాచారం తెలుసుకోండి: