సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎప్పుడు చెప్పలేం. అది ఎలాంటి సందర్భంలోనైనా సరే స్టార్ హీరోస్ ని కూడా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏకిపారేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు.  మరీ ముఖ్యంగా తోపైనా బడా హీరోస్ ని వేరొక హీరో బడా ఫాన్స్ దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.  కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరో రామ్ చరణ్ ని చాలా దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే .

గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్  కూడా రామ్ చరణ్ కి బిగ్ నెగిటివ్ గా మారిపోయింది . కాగా పెద్ది సినిమాతో ఆ ట్రోలింగ్ పాజిటివిటీగా మార్చుకోవడానికి చూస్తున్నాడు రామ్ చరణ్.  ఈ క్రమంలోనే రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు . లండన్ లోని మేడం టుసాడ్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు . భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం స్వయంగా రామ్ చరణ్ తన విగ్రహాన్ని రివిల్ చేశారు . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుంటే.. కొంతమంది  విగ్రహాన్ని చూసి ట్రోల్ చేస్తున్నారు . మైనపు విగ్రహంలో చరణ్ ఒక్కడే ఉంటే పర్వాలేదు. చరణ్ తో పాటు అతడి పెట్ డాగ్ కూడా ఉంది .

ఇదే ఇప్పుడు ఆయనకు కొత్త తలనొప్పులు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి చేస్తుంది. ఇప్పటివరకు హీరోలు హీరోయిన్ మాత్రమే చూసాం . ఇదేంటి ఇప్పుడు పెట్ డాగ్  విగ్రహాన్ని కూడా చేస్తారా..? అంటూ జనాలు ఓ రేంజ్ లో రాంచరణ్ ని ఆడేసుకుంటున్నారు. మీ పక్కనే ఉండాల్సిన భార్య విగ్రహాన్ని మాత్రం చేయలేదు కానీ నీకు ఫేవరెట్ అయిన పెట్ డాగ్ విగ్రహాని చేశారు ఇదేనా నువ్వు నీ భార్యపై చూపించే ప్రేమ.. నీకు తెలియకుండానే ఇలా జరుగుతుందా అంటూ రకరకాలుగా రాంచరణ్  ని ట్రోల్ చేస్తున్నారు . కొంతమంది కావాలని రాంచరణ్ పరసనల్  మ్యాటర్ పై  బూతు పదాలతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు రాంచరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి . రామ్ చరణ్ ప్రెసెంట్ "పెద్ది" అనే సినిమా షూట్ చేస్తున్నాడు . ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది..!


మరింత సమాచారం తెలుసుకోండి: