తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన రవి బాబు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సురేష్ బాబు నిర్మించిన అల్లరి మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ 2002 వ సంవత్సరం మే 10 వ తేదీన విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 23 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం.

ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ... అల్లరి సినిమా మొత్తం పూర్తి అయింది. విడుదలకు దగ్గరగా వచ్చింది. ఆ సమయంలో రవి బాబు నాతో మాట్లాడుతూ సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చింది. నీ పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నావా అన్నాడు ..? నేను లేదు సార్ అన్నాను. దానితో ఆయన వెంటనే పూర్తి చెయ్. విడుదల తేదీ దగ్గర పడింది. ఆ తర్వాత కష్టం అవుతుంది అని చెప్పాడు. దానితో నేను ఆ తర్వాత వెంటనే డంపింగ్ స్టూడియో కు వెళ్లి నా పాత్రకి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాను. ఇక రాత్రి 11 గంటలకు నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పడం మొదలు పెడితే ఉదయం 5 గంటల వరకు మొత్తం చెప్పేసా. డబ్బింగ్ చెప్పడం మొత్తం అయ్యాక డబ్బింగ్ థియేటర్ బయట నిలబడి ఉన్నాను.

సురేష్ బాబు గారు జాగింగ్ చేస్తూ అటు వైపు వచ్చి నన్ను చూశాడు. ఎందుకు ఇక్కడ ఉన్నావు అన్నాడు ..? దానితో నేను డబ్బింగ్ చెప్పాను సార్ అన్నాను. ఇంత త్వరగా ఎలా చెప్పావు అన్నాడు. లోపలికి వెళ్లి నేను చెప్పిన డబ్బింగ్ చూసి షాక్ అయ్యే సూపర్ గా చెప్పావు అని వెళ్ళిపోయాడు. అలా సురేష్ బాబు గారు కూడా నేను స్పీడ్ గా డబ్బింగ్ చెప్పడం చూసి షాక్ అయ్యాడు అని అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: