టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం ఖలేజా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అనుష్క , మహేష్ కి జోడిగా నటించగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... బ్రహ్మానందం , సునీల్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2010 అక్టోబర్ 7 వ తేదీన విడుదల అయింది.

మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో కలెక్షలను వసూలు చేయలేకపోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ గా విజయం సాధించినప్పటికీ ఈ సినిమాకు బుల్లి తెర ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే మహేష్ హీరో గా రూపొందిన ఖలేజా సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను మే 30 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mb