జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోనే .. కాకపోతే అందరితో కలిస్తే మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతాడు . బాగా అల్లరి చేస్తాడు. సరదాగా లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అందరితో కలిసి పోవాలి అనేది ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ అనుకుంటూ ఉంటారు . కానీ కొంతమంది మాత్రం దూరం పెడుతూ ఆయనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఆయన గురించి లేనిపోని నిందలు వచ్చేలా మాట్లాడుతుంటారు . అవన్నీ పక్కన పెడితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ గురించి మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి .

మనకు తెలిసిందే రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల బాండింగ్ . అయితే మరొకసారి వీళ్ళ బాండింగ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. వీళ్ళిద్దరు కలిసి ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో నటించారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  చాలా కాలం తరువాత జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఒకే స్టేజిపై మెరిసారు. రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికగా రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ల పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.  ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ..రామ్ చరణ్ కి ఉన్న ఒక అలవాటు గురించి బయట పెట్టాడు .

జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాట విని స్టేజ్ పై ఉన్న జనాలే కాదు స్టేజి కింద ఉన్న ఆడియన్స్ కూడా తెగ నవ్వుకున్నారు . "రాంచరణ్ ఒకప్పుడు మంచి భోజనం ప్రియుడు అని ..మరి ముఖ్యంగా రామ్ చరణ్ కి భోజనంతో పాటు వెన్నపూస కూడా ఉండాలి అని ..అది లేకపోతే ముద్ద దిగదు అని చెప్పుకొచ్చారు"..దీంతో అక్కడ ఉన్న వాళ్లు పక్కపక్క నవ్వేశారు . రాయల్ ఆల్బర్ట్ హాల్ మొత్తం రాంచరణ్ - ఎన్టీఆర్ నినాదలతో ఫ్యాన్స్ మారు  మోగించేశారు . రాయల్ ఆల్బర్ట్ హాల్లో లైవ్ కాన్సర్ట్ చేసే అవకాశం దక్కించుకున్న చిత్రంగా విదేశీ చిత్రం బాహుబలి 2 ఆ తర్వాత ఆ ఘనత అందుకుంది ఆర్ ఆర్ ఆర్ మాత్రమే . హైలెట్ ఏంటంటే రెండు సినిమాలకి డైరెక్టర్ రాజమౌళినే..!


మరింత సమాచారం తెలుసుకోండి: