అంతేకాదు ప్రభాస్ స్పందించి రెస్పాండ్ అవుతూ పోస్ట్ పెట్టినా కూడా 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరోకి ఆ మాత్రం తెలీయదా..? అంటూ టార్గెట్ చేసి మరి ట్రోల్ చేశారు . ఇలాంటివి ప్రభాస్ చూసి చూడనట్లు వదిలేసిన రెబల్ ఫాన్స్ మాత్రం అస్సలు ఊరుకోరు . ఇప్పుడు సినిమాల పరంగా కూడా ప్రభాస్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ప్రభాస్ సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాకి స్పిరిట్ అంటూ ఎప్పుడో నామకరణం చేశారు . ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ లీకై వైరల్ అయిన రెబల్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేస్తూ ఉంటారు .
అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా దీపిక పదుకొనే సెలెక్ట్ అయ్యింది అని దానికోసం ఆమె ఏకంగా 20 కోట్లు ఛార్జ్ చేస్తుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అయితే సినిమాలో హీరోయిన్ చూస్ చేసుకునే బాధ్యత పూర్తిగా సందీప్ రెడ్డివంగానే తీసుకున్నారట. కానీ ట్రోలింగ్ మాత్రం ప్రభాస్ పై పడుతుంది . ప్రభాస్ ముసలోడు అని అందుకే పెళ్లయిన ఆంటీ తోనే రొమాన్స్ చేయాలి అనుకుంటున్నాడు అని .. ఓవర్గం ప్రేక్షకులు ప్రభాస్ ని దారుణంగా టార్గెట్ చేసే ట్రోల్ చేస్తున్నారు.
అంతేకాదు ప్రభాస్ ఇక ఇండస్ట్రీలో హీరోగా కాకుండా అంకుల్ పాత్రలు చేస్తే బాగుంటుంది అంటూ కూడా ఘాటు కౌంటర్స్ వేస్తున్నారు. సోషల్ మీడియాలో అలాంటి వాళ్ళకి ఘాటు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ దీపికను చూస్ చేసుకుంటే ప్రభాస్ తప్పేముంది ..? అయినా ప్రభాస్ ని ఎందుకు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు ..? అంటూ ఫైర్ అవుతున్నారు . ప్రభాస్ అలాంటి చిల్లర గాల నోర్లు మూయించాలి అంటే త్వరగా పెళ్లి చేసుకోవాలి అంటూ కూడా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . అయితే ప్రభాస్ తన పెళ్లి పై మాత్రం ఏ విధంగా రియాక్ట్ అవ్వడు అది అందరికీ తెలుసు..!