కోలీవుడ్లో హీరో జయం రవి పేరు సంచలనంగా మారుతోంది.ముఖ్యంగా ఆయన భార్య ఆర్తితో విడాకులు తీసుకోవడానికి సిద్ధమైన తరువాత ఎక్కువగా వినిపించింది. ప్రస్తుతం వారి విడాకుల కేసు కోర్టులో ఉన్నది. అయితే ఈ నేపథ్యంలోనే జయం రవి ఆర్తి విడిపోవడానికి గల కారణం ప్రముఖ సింగర్ కేనిషా. ఈ సింగర్ హీరో రవితో కలిసి పబ్లిక్ గానే ఈవెంట్స్ కి వెళ్తూ కనిపిస్తూ ఉన్నది. దీంతో వివాదాస్పదంగా మారుతున్నారు రవి.  ఆర్తి చాలా బాగా ద్వేగమైన పోస్టులను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నది. చాలామంది నటీనటులు సైతం ఆర్తికి మద్దతు గానే నిలుస్తూ ఉన్నారు.


ముఖ్యంగా జయం రవి తన పేరుని రవి మోహన్ గా మార్చుకోవడం వెనుక కూడా కేనిషా పాత్ర ఉందని కోలీవుడ్లో వార్తలు వచ్చాయి. కానీ తన స్నేహితురాలు విజయంతి రాజేశ్వరి మాత్రం కేనీషా గురించి చాలామంది తప్పుగా అపార్థం చేసుకుంటున్నారని తన ఇంస్టాగ్రామ్ లో వివరణ ఇస్తూ  షేర్ చేసింది. అటు రవి, కేనిషా గురించి రోజుకోక  వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరొక వార్త కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేలా కనిపిస్తోంది.


రవి మోహన్, కేనిషా కోసం ముంబైలో ఒక కొత్త ఇల్లును కొన్నారని దాని విలువరూ .10 కోట్లు ఉంటుందని అలాగే సింగర్ గోవాలో కూడా నిర్వహిస్తున్న హీలింగ్ సెంటర్ కోసం రూ .5 కోట్ల రూపాయలు  ఖర్చు చేశారట. అయితే గత కొద్ది రోజులుగా రవి భార్య, ఆర్తి మాత్రం తనకు, తన పిల్లలకు ఏ విధంగా కూడా డబ్బు సహాయం చేయలేదని దీంతో తాము ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నామనే విధంగా తెలియజేసింది. మరి ఇలాంటి సమయంలో జయం రవి మీద చాలానే ట్రోల్స్ వినిపిస్తున్నాయి. మరి సింగర్ కేనిషా లగ్జరీ హౌస్ పై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: