"సమంత అబ్బో.. ఆవిడ.. మొగుడు వదిలేసి దేశాలు దేశాలు తిరిగేస్తుందిగా ..?".. నిన్న మొన్నటి వరకు ఇలాగే మాట్లాడుకునే వాళ్ళు జనాలు మరి ముఖ్యంగా సమంత అంటే టార్గెట్ చేసి ట్రోల్ చేయడానికి ఎప్పుడూ ఒక వర్గం ప్రేక్షకులు కాచుకుని కూర్చుని ఉండేవారు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు సమంత అంటే "వావ్..ఎవరు సపోర్ట్ లేకుండా..ఒక సినిమాను ప్రొడ్యూస్ చేసి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అందరికీ రోల్ మోడల్ ..మరి ముఖ్యంగా సమంత అంటే ఉమెన్స్ కి ఒక పెద్ద అండగా నిలుస్తుంది . ఇలాగే మాట్లాడుకుంటున్నారు జనాలు. దాన్నంతటికి కారణం ఒకే ఒక్క మూవీ అని చెప్పుకోక తప్పదు. అదే శుభం మూవీ .


సమంత - నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు మయోసైటీస్ వ్యాధి వచ్చిన తర్వాత అసలు ఇండస్ట్రీలో ఏ హీరోలు కూడా ఆమెకు సపోర్ట్ చేయనటువంటి మూమెంట్ ని అందరూ చూశాం. అయితే శుభం సినిమా ప్రమోషన్స్ కి కూడా ఇద్దరు హీరోలు రమ్మంటే రాకుండా .. ఆమెకు హ్యాండ్ ఇచ్చారు అన్న వార్తలు వినిపించాయి . కానీ తన నమ్మకాన్ని తన కష్టాన్ని నమ్ముకుంది సమంత . శుభం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సమంత ప్రొడ్యూస్ చేసిన మొదటి సినిమా హిట్ కొట్టడం అందరికీ హ్యాపీనెస్ క్రియేట్ చేసింది .



సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమా జనాలను ఎంత ఆకట్టుకుందో ..ఎంత ఎంటర్టైన్ చేసిందో  సోషల్ మీడియా ద్వారా కొన్ని వీడియోలు షేర్ చేసి సమంత శుభం సినిమా హిట్ అయింది అంటూ చెప్పకనే చెప్పేసింది. అంతేకాదు చాలామంది సమంత ఈజ్ బ్యాక్ అని .. ఇక సమంతను ట్రోల్ చేసిన వాళ్ళు నోరు మూసుకుంటే బెటర్ అని సమంత  ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు . అంతేకాదు రాజ్ నిడమూరుతో రిలేషన్షిప్ పై కూడా సమంత ఒక క్లారిటీ ఇచ్చేసింది అని ..తాజాగా సమంత - రాజ్  భుజంపై వాలిన ఫోటోను షేర్ చేసింది .



ఈ ఒక్క ఫోటో చాలు వీరిద్దరి రిలేషన్ లో ఉన్నారు అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ఎవరైతే నాగచైతన్య - శోభిత ధూళిపాల పెళ్లి చేసుకున్న తర్వాత సమంత లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అని ఇక ఆమె బతుకంతా ఇక కుక్కలతో గడపాల్సిందే అంటూ దారుణంగా కౌంటర్ వేశారో అలాంటి వాళ్ళు ఇక నోరు మూసుకోండి.. సమంతకి కూడా ఒక తోడు దొరికింది అంటూ సమంత ని టార్గెట్ చేసి ట్రోల్ చేసిన వాళ్ళకి కౌంటర్స్ వేస్తున్నారు. సమంత పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది..!!



మరింత సమాచారం తెలుసుకోండి: