మన కరోనా రాకముందు మన దేశానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఓ టి టి కంటెంట్ ను వీక్షించేవారు కాదు. ఎప్పుడు అయితే భారత దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో ఆ సమయంలో చాలా కాలం పాటు థియేటర్లు మూతపడ్డాయి. ఇక టీవీలలో కూడా కొత్త కంటెంట్ కరువైపోయింది. అలాంటి సమయంలో ఓ టి టి లో ఉన్న కంటెంట్ ను చూడడానికి జనాలు చాలా ఆసక్తిని చూపించారు. దానితో కరోనా సమయంలో ఓ టీ టీ లకు జనాలు బాగా అలవాటు పడిపోయారు. దానితో అనేక ఓ టి టి ప్లాట్ ఫామ్ లు కూడా పుట్టుకొచ్చాయి.

ఇకపోతే ఓ టి టి ప్లాట్ ఫామ్ ల మధ్య కాంపిటీషన్ పెరగడంతో వారు ప్రతి వారం ఏదో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగా కొన్ని సినిమాలు నెల తిరగకుండానే ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇకపోతే చిన్న సినిమాల విషయం పక్కన పెడితే కొంత మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా చాలా తక్కువ కాలంలోనే ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సూర్య రెట్రో అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

పూజా హెగ్డే ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మే 1 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇక తాజాగా ఈ సినిమా ఓ టి టి విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ ఓ టీ టీ లో మరికొన్ని రోజుల్లో తమిళ్ , తెలుగు , మలయాళ. కన్నడ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: