బాలీవుడ్ ప్రముఖ నటి..నిర్మాత.. కొరియోగ్రాఫర్..డైరెక్టర్ అయినటువంటి ఫరాఖాన్ అంటే సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ బాలీవుడ్ లో ఆమె చాలా ఫేమస్. అయితే అలాంటి ఫరా ఖాన్ తన భర్త ఓ స్వలింగ సంపర్కుడు.. గే అంటూ మాట్లాడి సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇక ఓవైపు సినీ ఇండస్ట్రీలో రాణిస్తూనే మరోవైపు యూట్యూబ్ బ్లాగ్స్ ద్వారా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేస్తుంది ఫర్ ఖాన్. అలా తనకు సంబంధించి ఓ యూట్యూబ్ బ్లాగ్ లో తన భర్త శిరీష్ కుందర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆ యూట్యూబ్ బ్లాగ్ లో ఫరా ఖాన్ ఏం మాట్లాడిందంటే.. నా భర్త శిరీష్ కుందర్ ఓ గే.. ఈ విషయం నాకు పెళ్ళైన 6 నెలలకే తెలిసింది.కానీ ఏం చేయలేని పరిస్థితి.మా పెళ్లయి  20 ఏళ్లు దాటినప్పటికీ ఇప్పటికి కూడా శిరీష్ కుందర్ నాకు ఒక్కసారి కూడా క్షమాపణ చెప్పలేదు. 

ఎందుకంటే ఆయన మనసులో ఆయన తప్పు చేసినట్టు ఏ కోణాన కూడా అనుకోడు. అందుకే ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు.. ఇక పెళ్లయిన తర్వాత చాలా రోజులు నన్ను టార్చర్ చేశాడు.ఏ విషయం చెప్పినా కూడా పట్టించుకునే వాడు కాదు. ఎన్నిసార్లు చెప్పినా అక్కడే మౌనంగా ఉండి పోయేవాడు. దాంతో ఆయన్ని చూసి నాకు చాలా కోపం వచ్చేది అంటూ ఫరా ఖాన్ చెప్పుకొచ్చింది. ఇక ఫరా ఖాన్ శిరీష్ కుంధర్ మెయిన్ హు నా అనే మూవి సెట్లో తొలిసారి కలుసుకున్నారు. అయితే మొదట్లో వీరిద్దరూ ఎక్కువగా గొడవపడేవారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమలో పడ్డారు.

 అలా 40 ఏళ్ల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫరా ఖాన్ పెళ్లయిన రెండేళ్లకు ముగ్గురు పిల్లలకు IVF ద్వారా జన్మనిచ్చింది. అలా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే తన భర్త గే అయినందుకు ఏనాడూ కూడా ఫరా ఖాన్ బాధపడలేదట. అంతేకాదు తాను ఇప్పుడు ఇండస్ట్రీలో ఇన్ని గౌరవ ప్రతిష్టలు అందుకోవడానికి ప్రధాన కారణం కూడా తన భర్తే అని చెప్పుకుంటుంది.అలాగే వివాహమైన సమయంలో వీరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయే స్టేజ్ కి వెళ్లారట. కానీ వారి మధ్య ఉన్న ప్రేమే మళ్ళీ వీరిని కలిపినట్టు చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: